News April 5, 2024
వరంగల్ RDO ఆఫీసు జప్తు
తెలంగాణ హైకోర్టు తీర్పుతో వరంగల్ RDO ఆఫీసును అధికారులు జప్తు చేశారు. గీసుకొండ మండలం శాయంపేట సమీపంలో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్ కోసం భూమి ఇచ్చిన నిర్వాసితులకు పరిహారం అందలేదు. దీనిపై రైతు సముద్రాల స్వామి, అతడి కూతురు వెన్నెల హైకోర్టును ఆశ్రయించారు. పరిహారం ఇవ్వాలని గతంలో ఇచ్చిన తీర్పును పట్టించుకోకపోవడంతో RDO ఆఫీసు జప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
Similar News
News December 25, 2024
WGL: BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి WGLజిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
News December 25, 2024
ప్రత్యేక రూపంలో భద్రకాళి అమ్మవారు
వరంగల్లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈరోజు గురువారం ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
News December 25, 2024
రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించండి: వరంగల్ సీపీ
వరంగల్ సీపీ అంబ కిషోర్ ఝా వార్షిక తనిఖీల్లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వారిపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. శాంతి భద్రత దృష్ట్యా రాత్రి వేళలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అనంతం మొక్కను నాటారు.