News January 20, 2026
వరంగల్: SBI ఏటీఎంలో చోరీ.. నిందితుల ARREST

వరంగల్ పరిధి శంభునిపేట SBI ఏటీఎంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులు యూపీకి చెందిన వినయ్ కుమార్, వినీత్ కుమార్‌ను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1.27 లక్షల నగదు, రెండు మొబైల్స్, ఒక వీసా ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ తెలిపారు. మంగళవారం మట్వాడ ఏఎస్పీ ఆఫీస్‌లో నిందితులను మీడియాకు చూపారు. కాజీపేటకు చెందిన కాళేశ్వరవు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసును ఛేదించామన్నారు.
Similar News
News February 21, 2026
వనపర్తి: RSETIలో ఉచిత శిక్షణ.. అప్లై చేసుకోండి!

యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(UBI RSETI) ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ కల్పిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. సీసీ కెమెరా టెక్నీషియన్, పుట్టగొడుగుల పెంపకం త్వరలో ప్రారంభం కాబోతున్నాయని ఈనెల 25 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఉచిత శిక్షణ, భోజనవసతి కలదు. ఆసక్తి గల 18-50 వయసు గల అభ్యర్థులు 9885940945, 8522088978ను సంప్రదించండి.
News February 21, 2026
అన్నమయ్య జిల్లాలో ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు: SP

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్నమయ్య జిల్లాలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP ధీరజ్ తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని యాజమాన్యాలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
News February 21, 2026
పరిగి: తొండపల్లి సమీపంలో ఘోర ప్రమాదం

పరిగి మం.తొండపల్లి గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్‌నగర్–పరిగి ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన లారీ ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. లాల్ పహాడ్ నుంచి రాపోల్ వైపు వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. శరీరం నుజ్జు నుజ్జు కావడం అక్కడివారిని తీవ్రంగా కలచివేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.


