News August 26, 2025
వరంగల్: SI నంబర్ నుంచి అనుమానాస్పద ఏపీకే ఫైల్స్

పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ పేరుతో పలు వాట్సప్ గ్రూపుల్లో WGL జిల్లా నల్లబెల్లి ఎస్సై గోవర్ధన్ నంబర్ నుంచి అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ షేర్ కావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఫైల్స్‌ను గమనించినవారు వెంటనే ఇది సైబర్ నేరస్థుల పనై ఉంటుందని గుర్తించి ఇతరులను అలర్ట్ చేశారు. పోలీసుల ఫోన్ నంబర్లను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారనేది ఇక్కడ మరోసారి రుజువైంది.
Similar News
News August 26, 2025
సాదియా అంకితభావం యువతకు స్ఫూర్తి: లోకేశ్

AP: IPF వరల్డ్ క్లాసిక్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్ కాంస్య పతకం సాధించారు. ఆమెకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ‘అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించారు. దేశంతో పాటు మన మంగళగిరికి గర్వకారణంగా నిలిచారు. ఆమె అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి’ అని ఆకాంక్షించారు.
News August 26, 2025
KMR: డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కుపాదం

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది 7 నెలల్లోనే 6,800 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారు. తాజాగా AUG 22న కోర్టు 91 మందికి శిక్షలు వేసింది. వీరిలో 16 మందికి ఒక రోజు జైలు శిక్ష, ఒకరికి 2 రోజుల జైలు శిక్ష విధించారు. మిగిలిన 74 మందికి రూ. 1,100 చొప్పున జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని SP రాజేష్ చంద్ర హెచ్చరించారు.
News August 26, 2025
NLG: జిల్లాలో పదోన్నతుల కోలాహలం

జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతుల కోలాహలం కొనసాగుతుంది. 2024లో కూడా ప్రభుత్వం పదోన్నతులను ఆన్లైన్లో చేపట్టినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు స్పౌజ్, హెల్త్ వంటి అంశాలపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల జిల్లాలో 37 SAలకు జిహెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. తాజాగా SGTలకు LFL హెచ్ఎంలుగా, SAలుగా168 మందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.