News August 27, 2025
వరంగల్: WOW.. కనురెప్పపై సూక్ష్మ గణపతి

వరంగల్ నగరానికి చెందిన సూక్ష్మ కళాకారుడు మట్టేవాడ అజయ్ కుమార్ కనురెప్పపై సూక్ష్మ గణపతిని రూపొందించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 120 గంటల పాటు శ్రమించి 0.37మి.మీ ఎత్తులో గణనాథున్ని తయారుచేశారు. అజయ్ కుమార్ అనేక సూక్ష్మ కళాఖండాలను రూపొందించి అనేక అవార్డులు సాధించారు. ప్రత్యేకమైన సూక్ష్మ కళారూపాలను రూపొందిస్తూ అయన ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారు.
Similar News
News August 27, 2025
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు 18 క్రీడాకారులు ఎంపిక

తణుకులో మంగళవారం జరిగిన ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ అండర్–17 బాలుర, బాలికల ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్ ఎంపికల్లో 18 మంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పశ్చిమ గోదావరి ఫెన్సింగ్ అసోసియేషన్ సెక్రెటరీ గుణ్ణం కృష్ణమోహన్ తెలిపారు. ఈ పోటీలకు జిల్లా నుంచి 60 మంది పాల్గొన్నారని చెప్పారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 30న శనివారం భీమవరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.
News August 27, 2025
ములుగు జిల్లాలో స్థానిక ఎన్నికలకు రె’ఢీ’

సెప్టెంబర్ 2 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఆశావాహులు పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా, ములుగు జిల్లాలో 10 మండలాలు, 171 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 1,520 వార్డులు ఉండగా, 1,535 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరగనుంది. జిల్లాలో మహిళలు 1,26,433 ఉండగా, పురుష ఓటర్లు 1,18,590 మంది ఉన్నారు.
News August 27, 2025
NLG: గణపతి నవరాత్రులు.. జాగ్రత్తగా ఉండండి.!

విఘ్నాలు తొలగి అంతా మంచే జరగాలని కోరుతూ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. ఈ క్రమంలో నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విగ్రహాలు తరలించ్చేటప్పుడు, విద్యుత్ వైర్లతో, మండపాల్లో జాగ్రత్తగా ఉండి భక్తిశ్రద్ధలతో నవరాత్రులు పూజలు చేయాలని పోలీసులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెబుతున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.