News January 5, 2025
వరదయ్యపాలెం: కరెంట్ బిల్లు రూ.47 వేలు

వరదయ్యపాలెం మండలం కోవూరుపాడుకు చెందిన మారెయ్య తన ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి కంగుతిన్నాడు. జనవరి నెలలో కరెంట్ బిల్లు రూ.47,932 రావడంతో నోరు వెల్లబెట్టాడు. గత నెలలో రూ. 830 బిల్లు వచ్చినట్లు తెలిపారు. ప్రతినెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. దీంతో బాధితుడు వరదయ్యపాలెం విద్యుత్ శాఖ కార్యాలయ అధికారులను ఆశ్రయించాడు.
Similar News
News January 30, 2026
కుప్పంలో CM పర్యటనకు సర్వం సిద్ధం

CM చంద్రబాబు 3 రోజులు కుప్పం నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో పర్యటించనున్నారు. CM పర్యటన కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం గుంటూరు పర్యటన ముగించుకుని హెలికాప్టర్లో గుడిపల్లి (M) అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొనున్నారు. అక్కడి నుంచి కుప్పం నియోజకవర్గ పర్యటన ప్రారంభిస్తారని అధికారికంగా సమాచారం వెలువడింది.
News January 29, 2026
చిత్తూరు: ఫిబ్రవరి 4వ వరకే ఛాన్స్.!

చిత్తూరు జిల్లాలో 4 బార్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. 2025-28 సం.గాను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీలోపు దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో 5వ తేదీన కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో బార్లను కేటాయిస్తారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు https://oc.hpfsproject.com వెబ్ సైట్ చూడాలన్నారు.
News January 29, 2026
CM సభకు అక్రిడేషన్ కలిగిన రిపోర్టర్లకే అనుమతి

కుప్పంలో ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు సీఎం చంద్రబాబు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో 31న నిర్వహించే బహిరంగ సమావేశానికి అక్రిడేషన్ కలిగిన విలేకరులకు మాత్రమే అనుమతి ఉంటుందని జిల్లా సమాచార శాఖ అధికారులు గురువారం స్పష్టం చేశారు. మిగిలిన అన్ని కార్యక్రమాలు లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షించ వచ్చని వెల్లడించారు.


