News March 25, 2024

వరదయ్యపాళెం: అక్క మరణాన్ని తట్టుకోలేక దివ్యాంగుడి ఆత్మహత్య

image

మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన బీఎన్ కండ్రిగ మండలంలో చోటుచేసుకుంది. SI ప్రతాప్ వివరాల ప్రకారం.. కంచనపుత్తూరునకు చెందిన ప్రత్యేక ప్రతిభావంతుడైన బాలమురుగయ్య (26) మండలంలోని ఇందిరానగర్ పంచాయతీ పద్మావతిపురంలో నివాసముంటూ వరదయ్యపాళెం SBI ఎదురుగా నెట్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల అక్క హత్యకు గురికాగా మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News January 8, 2026

చిత్తూరు కోర్టులో పేలుడు పదార్థాలు లేవు: పోలీసులు

image

చిత్తూరు కోర్టులో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. జడ్జికి బాంబు బెదిరింపులపై మెయిల్ రావడంతో అడిషనల్ ఎస్పీ దేవదాస్ ఆధ్వర్యంలో సిబ్బంది నాలుగు బృందాలు కోర్టులో తనిఖీలు చేపట్టాయి. కోర్టులోని వారిని సురక్షితంగా బయటకు పంపి అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఐదు గంటలపాటు సాగిన తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు తేల్చారు.

News January 8, 2026

చిత్తూరు: ఈ నెల 10న స్కూళ్లకు హాలిడే.!

image

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 10న రెండో శనివారం సెలవుగా ప్రకటించినట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. గతంలో ఆ రోజును ప్రత్యామ్నాయ పాఠశాల దినంగా గుర్తించి పనిచేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కానీ ప్రభుత్వం 10న సంక్రాంతి సెలవు మంజూరు చేయడంతో పాఠశాలలు పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ రోజుకు ప్రత్యామ్నాయంగా పనిచేయాల్సిన తేదీని మళ్లీ ప్రకటిస్తామన్నారు.

News January 8, 2026

చిత్తూరు: హంతకుడు నేషనల్ క్రికెటర్ గణేశేనా.?

image

ఆయన వికలాంగుడు.. <<17815171>>దేశానికి<<>> ఆడుతుంటే అందరూ శభాష్ అన్నారు. విజయం ఇచ్చిన <<18790831>>గర్వమో<<>>, మానవత్వం మరిచాడో ప్రేయసిని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. SRపురానికి చెందిన క్రికెటర్ గణేశ్ కవితను చంపి నీవా నదిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కూడా వికలాంగురాలు. వీరి మధ్య ఇది వరకే పెళ్లి ప్రస్తావనపై గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.