News October 16, 2025
వరదలతో భవానీ ఐలాండ్ టూరిజానికి రూ.1.8 కోట్ల నష్టం

కృష్ణా నదికి వచ్చిన వరదలతో విజయవాడ భవానీ ఐలాండ్ మూతపడింది. దాదాపు 60 రోజులపాటు టూరిస్టులు రాకపోవడంతో బోటింగ్‌కు రూ.1.5కోట్లు, బరంపార్కులో కొన్ని ఫంక్షన్లు రద్దు కావడం, టూరిస్టులు రాకపోవడంతో రూ.30 లక్షల వరకు నష్టం వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో మూడు రోజుల నుంచి టూరిస్టుల రాక పెరగడంతో బోటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రూ.1.40 లక్షల ఆదాయం రోజుకు వస్తోంది.
Similar News
News October 16, 2025
18న రాజమండ్రిలో జాబ్ మేళా

తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 18న రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్రప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన రాజమండ్రిలో మాట్లాడారు. మేళాలో పలు ప్రైవేటు సంస్థల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ఆయన పేర్కొన్నారు.
News October 16, 2025
ఓరుగల్లు గిన్నప్ప రుచి వేరు..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో వంటకాలు ఉన్నప్పటికీ సర్వపిండి(గిన్నప్ప) చాలా స్పెషల్. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిపై చేసిన సర్వపిండి తింటే ఆ రుచి ఎప్పటికీ మరువరు. ఇది ప్రస్తుతం నగరాల్లోకి వ్యాపించింది. కర్రీ పాయింట్లలో రూ.15-30కి ఒక సర్వపిండి అమ్ముతున్నారు. ఈ జనరేషన్‌తో పోలిస్తే 90’sలో స్కూల్‌కు వెళ్లొచ్చేలోపు ఇంటి వద్ద అమ్మ చేసిన సర్వపిండి రెడీగా ఉండేది. నేడు ప్రపంచ భోజన దినోత్సవం. మీ కామెంట్.
News October 16, 2025
మల్లన్న సన్నిధిలో ముగ్గురి ముచ్చట్లు

ప్రధాని మోదీ శ్రీశైల మల్లన్న, భ్రమరాంబదేవిని దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. ప్రధాని హోదాలో తొలిసారి మల్లన్న ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం బయటికి వచ్చే మార్గంలో కుడివైపు ఉన్న మండపంపై ప్రధాని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూర్చుని ముచ్చటించిన తీరు చూపరులను ఆకట్టుకుంది. దర్శన వేళ వారు పంచెకట్టులో కనిపించారు.