News September 3, 2024

వరదల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి

image

సింహపురి ఎక్స్‌ప్రెస్ మహబూబాబాద్‌లో ఆగిపోవడంతో సర్వేపల్లి MLA సోమిరెడ్డి ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మున్సిపల్ ఛైర్మన్ ఇంట్లో ఆతిథ్యం పొందారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో ఖమ్మంకు బయలుదేరగా మార్గమధ్యలో రైలు నిలిచిపోయింది.దీంతో కారు, బైకులపై ఖమ్మంకు చేరుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో బసచేశారు. అనంతరం కారులో హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Similar News

News December 19, 2025

నెల్లూరు: కారుణ్య నియామక పత్రాలు అందజేత

image

విధి నిర్వహణలో ఉంటూ మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. జి. భాగ్యమ్మను ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కుక్ గా, టి. పవన్ ను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసానిచ్చారు.

News December 19, 2025

నెల్లూరు: డిజిటల్ సర్వేలో ‘పంట నమోదు’

image

రబీ సీజన్‌కు సంబంధించి డిజిటల్ పంట నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 18 నుంచి ఫిబ్రవరి వరకు సర్వే కొనసాగుతోంది. జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్న లక్ష మంది రైతులు సచివాలయ, వ్యవసాయ సహాయకుల ద్వారా తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలి. ధాన్యం కొనుగోళ్లు, వడ్డీ లేని రుణాలు, పంట బీమా, పరిహారం పథకాలు వర్తించాలంటే ఈ-క్రాప్ తప్పనిసరి అని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.

News December 19, 2025

నెల్లూరు: మాతృవేదన.. తీరేనా.!

image

నెల్లూరు జిల్లాలో హైరిస్క్‌ గర్భిణుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 44,536 మంది గర్భిణుల్లో రక్తహీనత, బీపీ వంటి సమస్యలతో 6,235 మందిని ‘హైరిస్క్‌’గా గుర్తించారు. వీరిపై నిరంతర పర్యవేక్షణ కొరవడటంతో మరణాలు ఆగడంలేదు. నాలుగేళ్లలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. ఈ ఏడాది ఇప్పటికే నలుగురు మృతి చెందారు. జిల్లాలో మెటర్నల్ మోర్టాలిటీ రేటు 19గా నమోదైంది. వైద్యశాఖ దృష్టిసారిస్తేనే ఈ ముప్పును నివారించగలరు.