News June 19, 2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన

image

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గోదావరి పరివాహకంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు తహశీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు.  ఉదయం 8.30 గంటలకు  కలెక్టర్ పర్యటన ఉంటుందని మండల స్థాయి సిబ్బంది ఎంపీడీఓ, ఎంపీవో, మండల వ్యవసాయ అధికారి, విద్యాశాఖ అధికారి, వివిధ శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.

Similar News

News July 5, 2025

38 సబ్ స్టేషన్లలో RTFMS పనులు పూర్తి: ఖమ్మం SE

image

వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (RTFMS) ఎంతగానో దోహదపడుతుందని ఖమ్మం సర్కిల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసా చారి అన్నారు. శనివారం ఎన్పీడీసీఎల్ పరిధిలో 100 సబ్ స్టేషన్లను గుర్తించామని, సర్కిల్ పరిధిలో 38 సబ్ స్టేషన్‌లలో RTFMS పనులు జరుగుతున్నాయని వివరించారు. మిగతా సబ్ స్టేషన్లలో కూడా త్వరలోనే పనులు పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు.

News July 5, 2025

రాజకీయాలు కాదు రైతుల శ్రేయస్సు ముఖ్యం: మంత్రి తుమ్మల

image

యూరియా విషయంలో ఎలాంటి రాజకీయం లేదని, రైతుల శ్రేయస్సే ముఖ్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ విషయంపై రాజకీయాలు వద్దని.. రాష్ట్రానికి వాటాగా రావాల్సిన 1.94 లక్షల టన్నుల యూరియాను తెప్పించేలా బీజేపీ నేతలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుత వానాకాలం (ఖరీఫ్) సీజన్ కోసమే యూరియా అడిగిందని, గత యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించింది కాదని స్పష్టం చేశారు.

News July 5, 2025

సాగర్ నుంచి పాలేరుకు నీటి విడుదల

image

పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ తగ్గినందున తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రాజెక్టు ఏఈ కృష్ణయ్య ఎడమ కాల్వ ద్వారా పాలేరుకు నీటిని విడుదల చేశారు. రోజుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.