News August 20, 2025
వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేపట్టాలి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో వరద బీభత్సానికి డ్యామేజ్ అయినా వివరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంప్, శానిటేషన్ తదితర వాటిపై కలెక్టర్ రాజర్షిషా అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సర్వే నిర్వహించాలన్నారు. జిల్లాలో వర్షానికి దెబ్బతిన్న పంటలను, రోడ్లు, తదితర వాటి అంచనాలను వేగవంతంగా పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని సూచించారు.
Similar News
News February 1, 2026
ఆదిలాబాద్: రేపటి నుంచి INTER ప్రాక్టికల్స్

జిల్లాలో ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ గణేశ్ కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాల్లో రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రశ్నాపత్రాలను ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పరీక్షలు పారదర్శకగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News February 1, 2026
‘ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోండి’

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థుల కోసం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ పథకం దరఖాస్తులు ప్రారంభమైనట్లు జిల్లా సంక్షేమ అధికారి సునీత కుమారి తెలిపారు. 2026 విద్యా సంవత్సరానికి అర్హులైన అభ్యర్థులు ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.