News October 30, 2025
వరద బాధితులు అధైర్యపడవద్దు: మంత్రి సురేఖ

మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు వరంగల్ నగరం, పరిసర ప్రాంతాలను జలమయం చేశాయి. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. వరద బాధితులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని.. నగర నాలాల విస్తరణ, కబ్జాల తొలగింపు, ప్రణాళికాబద్ధమైన నికాసి వ్యవస్థ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
Similar News
News October 30, 2025
మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల

ఖమ్మం: మున్నేరు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ 28 అడుగుల మార్కును దాటడంతో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సాయంత్రం కలెక్టర్, సీపీతో కలిసి నదిని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, తగిన సమీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ సహా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News October 30, 2025
ఇదేందయ్యా ఇదీ.. బంగారు నగలు ధరిస్తే రూ.50వేలు ఫైన్

మన దేశంలో బంగారు ఆభరణాలు ధరించడమంటే ఇష్టపడని వారుండరు. కానీ ఉత్తరాఖండ్‌లోని జౌన్సర్-బావర్ ప్రాంతంలో ఉన్న కంధర్ గ్రామ నివాసితులు వింత నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా అసమానతలు తగ్గించేందుకు ఒంటినిండా నగలు ధరిస్తే రూ.50వేలు జరిమానా విధించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. మహిళలు సైతం దీనికి అంగీకారం తెలిపారు. శుభకార్యాల్లో చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలనే నిబంధన విధించారు.
News October 30, 2025
RR : రేషన్ బియ్యం వేలం.. ఎక్కడో తెలుసా..?

జిల్లాలో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం, గోధుమలు, చక్కెరను సేకరించి అక్రమంగా వ్యాపారం చేసే వారి వద్ద నుంచి జప్తు చేసిన 947.496 MTల బియ్యం, 25.50 క్వింటాళ్ల గోధుమలు, 247కిలోల చక్కెర NOV18 న బహిరంగ వేలం వేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఎక్సైజ్ శాఖ ద్వారా అనుమతి పొందిన ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్ DCSO కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


