News November 6, 2025
వరద బాధిత కుటుంబాలకు సాయం ప్రకటించిన కలెక్టర్

కే.వి.బి.పురం మండలంలోని ఒళ్లూరు సమీప రాయల చెరువు తెగిపోవడంతో మూడు గ్రామాలు వరద నీటికి గురయ్యాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.3,000 ఆర్థిక సాయం కల్పించడంతో పాటు బియ్యం 25 కిలోలు, పప్పులు, కూరగాయలు, నూనె, చక్కెర వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. పశు నష్టం వాటిల్లిన రైతులకు ఆవు,గేదెకు రూ.50,000, మేకకు రూ.7,500 పరిహారం అందించబడుతుందని తెలిపారు.
Similar News
News November 7, 2025
కడప: శ్రీ చరణికి రూ.10 లక్షలు ప్రకటించిన ఎంపీ మేడా

వరల్డ్ కప్‌లో సత్తా చాటిన ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణికి రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి రూ.10 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన చరణి చూపిన ప్రతిభ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ బహుమతి ప్రకటించానని ఆయన చెప్పారు.
News November 7, 2025
రేషనలైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఈఆర్ఓ, ఎఈఆర్ఓలను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ప్రతిపాదించిన కేంద్రాలను స్వయంగా పరిశీలించి, నివేదికలు సమర్పించాలని సూచించారు. జిల్లాలో 1,629 పోలింగ్ కేంద్రాలు ఉండగా, కొత్తగా 113 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. కొత్త కేంద్రాలు ప్రైవేట్ పాఠశాలలు, రాజకీయ సంబంధిత భవనాల్లో ఏర్పాటు చేయరాదని పేర్కొన్నారు.
News November 7, 2025
విద్యార్థులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

ఆటోలు కళాశాలల స్కూల్ బస్సుల్లో విద్యార్థులను, ప్రజలను పరిమితికి మించి ఎక్కించుకొని ప్రయాణించరాదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టంచేశారు. గురువారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కళాశాలలు, స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, రోడ్ల వెంట ఆటోలను నిలపడం, మద్యం తాగి వాహనాలు నడిపడం వంటికి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.


