News September 3, 2025
వరద సహాయక చర్యలపై ఆదిలాబాద్ కలెక్టర్ సమీక్ష

ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ పనులపై కలెక్టర్ రాజర్షిషా బుధవారం అధికారులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల రవాణాను తక్షణమే పునరుద్ధరించాలని, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నష్టాన్ని వెంటనే అంచనా వేసి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Similar News
News September 3, 2025
నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించండి: ఆదిలాబాద్ SP

గణేష్ నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం సాయంత్రం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
News September 3, 2025
భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీనగర్ కాలనీ గణపతి

ADB జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో గడ్డితో తయారు చేసిన ప్రకృతి గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. హరియాలీ నుంచి గడ్డి తీసుకొచ్చి ఈ రూపాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి గణపతి పక్కన ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ సందర్శకులను ఆకర్షిస్తోంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఆలోచనతో ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు కాలనీ అధ్యక్షుడు పవర్, ప్రధాన కార్యదర్శి బండారి సంతోష్ తెలిపారు.
News September 3, 2025
ADB: ఈనెల 8న అప్రెంటిస్ షిప్ మేళా

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ఈనెల 8న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 8వ తేదీన నిర్వహించనున్న మేళాకు హాజరుకావాలని సూచించారు.