News January 30, 2026
వరల్డ్ కప్ గెలిస్తే ఇంకేం చేస్తారో?.. పాక్ పీఎం ట్వీట్‌పై సెటైర్లు!

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ ఇప్పుడు SMలో ట్రోల్స్‌కు గురవుతోంది. ఆస్ట్రేలియా ‘B’ టీమ్‌పై గెలిస్తేనే ప్రపంచకప్ గెలిచినంతగా PCB ఛైర్మన్‌ను ఆకాశానికెత్తడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక WC గెలిస్తే ఏం చేస్తారో అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇది అతిగా ఉందన్నారు.
Similar News
News February 14, 2026
పాలమూరు పురపోరు.. కాంగ్రెస్ ఏకపక్ష విజయం!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికలు జరిగిన MBNR కార్పొరేషన్‌లో 60 డివిజన్లు, 18 మున్సిపాలిటీలలో 316 వార్డులు ఉండగా..
కాంగ్రెస్ 30 డివిజన్లు, 179 వార్డులు,
BRS 15 డివిజన్లు, 75 వార్డులు,
BJP 7 డివిజన్లు, 38 వార్డులు,
AIFB 9(W),
MIM 6(W),
ఇండిపెండెంట్‌లు 9(W),
CPM రెండు స్థానాలు గెలుపొందాయి.
మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నిక వాయిదా పడింది.
News February 14, 2026
ఫొటో తీయండి.. ₹1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ కొట్టేయండి!

నేషనల్ హైవేలపై టాయిలెట్ల పరిశుభ్రతను పెంచేందుకు NHAI తెచ్చిన ‘Clean Toilet Picture Challenge’ గడువును 2026 జూన్ 30 వరకు పొడిగించారు. హైవేపై వెళ్లేటప్పుడు ఎక్కడైనా టాయిలెట్లు డర్టీగా ఉంటే ఆ ఫొటోను Rajmargyatra యాప్‌లో లొకేషన్ వివరాలతో అప్‌లోడ్ చేయాలి. కంప్లైంట్ నిజమని తేలితే 5రోజుల్లో మీ ఫాస్టాగ్ అకౌంట్‌కు ₹1,000 క్రెడిట్ అవుతాయి. ఈ ఆఫర్ కేవలం NHAI పరిధిలోని టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది.
News February 14, 2026
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

తూర్పు గోదావరి జిల్లాలో 6 కోర్టు అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 7వ తరగతి అర్హత కలిగి, వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. కోర్టు అసిస్టెంట్‌కు నెలకు రూ.10వేలు, కోర్ట్ అటెండెంట్‌కు రూ.6వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://eastgodavari.dcourts.gov.in/


