News September 25, 2025

వరల్డ్ క్లాస్ సిటీగా విశాఖ..!

image

విశాఖను ఐటీ హబ్‌గా మార్చే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మిలీనియం టవర్స్‌లో టీసీఎస్ తాత్కాలిక ఆఫీస్ ప్రారంభించి శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. కాగ్నిజెంట్, ANSR, సత్వ, యాక్సెంచర్ కూడా పెద్ద క్యాంపస్‌లను ప్రకటించాయి. రాబోయే 5, 10 ఏళ్లలో లక్షలాది ఐటీ ఉద్యోగాలు సృష్టించే వరల్డ్ క్లాస్ సిటీగా విశాఖ మారనుంది. దీంతో రియల్ ఎస్టేట్ సైతం పుంజుకునే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.

Similar News

News September 27, 2025

సంతానలక్ష్మి అవతారంలో కనుమహాలక్ష్మి అమ్మవారు

image

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం అమ్మవారు సంతాన లక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వేకువజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కలువ పువ్వులతో సహస్రనామార్చన చేపట్టారు. ఈవో శోభారాణి భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

News September 27, 2025

విశాఖ: ‘స్కానింగ్ కేంద్రాల్లో 5% ఉచితంగా వైద్య సేవలు అందించాలి’

image

విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాలు తనిఖీ చేయాలని, డాక్టర్ల విద్యార్హతలు, సెంటర్ డాక్యుమెంట్స్ పరిశీంచాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో 5% ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నారు. ఆ వివరాలు జిల్లా వైద్య అధికారికి అందజేయాలన్నారు.

News September 26, 2025

జీఎస్టీ లబ్ధికి అక్టోబర్‌లో షాపింగ్ ఫెస్టివల్: విశాఖ కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ప్రయోజనాలను ప్రజలకు అందించేందుకు ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. వివిధ రంగాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించి, జీఎస్టీ లబ్ధిని ప్రజలకు చేరవేస్తామని వివరించారు.