News March 31, 2025
వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ కార్యదర్శిగా ఈవీ శ్రీనివాస్

వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్(WTITC) గౌరవ కార్యదర్శి, సలహాదారుడిగా హనుమకొండకు చెందిన సామాజికవేత్త ఈ.వి.శ్రీనివాస్ రావును సంస్థ స్థాపకుడు సందీప్ మక్తాలా నియమించారు. ఈ సందర్భంగా ఈ.వీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలుగు ప్రజల ఐటీ రంగ పురోగతికి అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News April 2, 2025
ఉపాధిలో అల్లూరి జిల్లాకు రాష్ట్రంలో మొదటి స్థానం

ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా 69,062 కుటుంబాలకు 100 రోజుల ఉపాధిని అందించడం ద్వారా అల్లూరి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించిందని కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఉపాధి హామీ పథకం ప్రగతిలో జిల్లా ముందంజలో ఉందన్నారు. ప్రతి కూలీకి సగటున 74.85 రోజుల పనిని అందించడంతో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించిందన్నారు. హార్టికల్చర్ 10,939 ఎకరాలు సాగు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
News April 2, 2025
రామచంద్రపురం: స్నానానికి దిగి విద్యార్థి మృతి

రామచంద్రపురం మండలం వెల్ల లాకుల వద్ద మంగళవారం కాలువలోకి స్నానానికి దిగి పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఎలమంచిలి అఖిల్ (15) పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం పరీక్షలు పూర్తి కావడంతో స్నేహితులతో కలిసి పంట కాలువలో స్నానానికి దిగారు. కాలువలో నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో అఖిల్ కొట్టుకుపోయాడు. సాయంత్రానికి మృతదేహం లభించింది.
News April 2, 2025
హత్య జరిగిన 36 గంటల్లో నిందితుడు అరెస్ట్: సీఐ

కాసాని రాజేశ్ మృతికి కారణమైన నిందితుడిని అరెస్ట్ చేశామని భీమవరం రూరల్ సీఐ బి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 30న కోట సత్తెమ్మ తల్లి జాతరలో రాహుల్, రాజేశ్ మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో రాజేశ్‌ను మేకల సతీష్ అనే వ్యక్తి (చోటూ) కొట్టాడు. గాయాలతో రాజేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడ్ని 36 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.