News December 25, 2025
వరస వివాదాల్లో శ్రీశైలం మల్లన్న క్షేత్రం!

శ్రీశైలం మల్లన్న క్షేత్రం వరస వివాదాలతో SMలో వైరల్ అవుతోంది. భద్రతా లోపాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. మొన్న నిబంధనలకు విరుద్ధంగా ఓ అధికారి వ్యవహారం, ఓ యువతి డాన్స్, నిన్న క్షేత్ర పరిధిలో పేకాట తదితర ఘటనలతో మల్లన్న క్షేత్రం పేరు తెరపైకొస్తుంది. మరోవైపు అర్హతలను మరచి ప్రమోషన్లు ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. ఆ మల్లన్నే శ్రీశైలం క్షేత్రాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.
Similar News
News December 29, 2025
కర్నూలు: ‘నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోవాలి’

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత www.ncs.gov.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి సూచించారు. మొబైల్ నంబర్, ఆధార్, మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం, కెరీర్ మార్గదర్శనం, జాబ్ మేళాల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సందేహాలుంటే జిల్లా ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News December 29, 2025
ప్రజా ఫిర్యాదుల వేదికలో 101 విన్నపాలు

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 101 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, పలువురు సీఐలు పాల్గొన్నారు.
News December 29, 2025
కర్నూలు: తిరుమల వెళ్లి వస్తుండగా విషాదం

ఒంటిమిట్ట మండలంలోని మట్టంపల్లి-నందలూరు మధ్య ఆదివారం సాయంత్రం పూణే ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ తెలిపారు. మృతుడు కర్నూలు జిల్లా అప్సరి మండలం శంకరంబాడి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.


