News January 2, 2025
వరాహ అవతారంలో భద్రాద్రి రామయ్య
దక్షిణాది అయోధ్య భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా మూడో రోజు గురువారం వరాహ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మహానివేదన అనంతరం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు. నృత్యాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో విహరిస్తారు. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి, ఆలయ అధికారులు,భక్తులు పాల్గొన్నారు.
Similar News
News January 5, 2025
చైనా మాంజా అమ్మొద్దు: సీపీ సునీల్ దత్
ప్రజలు, పక్షుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదేశించారు. ఎస్‌హెచ్ఓలు తనిఖీలు చేపట్టి షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజలు సైతం ఈ మాంజా వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించామన్నారు.
News January 4, 2025
వామనావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రాముడు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి శనివారం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాహలం నడుమ ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
News January 4, 2025
ఖమ్మం: చింతకానిలో గుర్తు తెలియని మృతదేహం
ఖమ్మం జిల్లా చింతకాని నుంచి అనంతసాగర్ వెళ్లే మార్గ మధ్యలో ఉన్న మైసమ్మ గుడి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు వందేభారత్ రైలు కింద పడి ఆ వ్యక్తి మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. వ్యక్తి నుజ్జు నుజ్జు కావడంతో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.