News December 14, 2025

వరించిన అదృష్టం.. డ్రాలో సర్పంచ్ పదవి

image

TG: మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్‌గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించారు. మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. సునీత (కాంగ్రెస్), బీమిలి(బీఆర్ఎస్) ఇద్దరికి 182 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి, ఒకటి NOTAకు పడింది. ఇద్దరికీ సమానంగా రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి కేతావత్ సునీతను విజయం వరించింది.

Similar News

News December 15, 2025

AFCAT-2026 దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT-1/2026) దరఖాస్తు గడువును DEC 19వరకు పొడిగించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 340 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ లేదా బీఈ, బీటెక్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-26ఏళ్లు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్‌లో ₹56,100, ఆ తర్వాత ₹1,77,500 వరకు జీతం ఉంటుంది. వెబ్‌సైట్: https://afcat.cdac.in/

News December 15, 2025

సోషల్ మీడియా వెట్టింగ్.. ఏం చేస్తారు?

image

‘నా అకౌంట్.. నా ఇష్టం.. ఏమైనా పోస్టు చేస్తా.. కామెంట్ చేస్తా’ అని అంటే USలో చెల్లుబాటు కాదు. చదువు, ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లాలనుకునే వ్యక్తుల FB, X, ఇన్‌స్టా, లింక్డిన్ తదితర SM అకౌంట్లలోని పోస్టులు, కామెంట్లను US అధికారులు లోతుగా <<18568140>>పరిశీలిస్తారు.<<>> డిలీట్ చేసినా పట్టేస్తారు. జాత్యాహంకార, లైంగిక, హింసాత్మక, చట్టవిరుద్ధ వ్యాఖ్యలు, USకు వ్యతిరేక ఆలోచనలు ఉన్నట్లు అనిపిస్తే వీసా రిజెక్ట్ చేస్తారు.

News December 15, 2025

తల్లిపాలు ఎలా మాన్పించాలంటే..!

image

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. కానీ వయసు పెరుగుతున్నా కొందరు పిల్లలు పాలు మానరు. దీనికోసం ఒకేసారి మాన్పించకుండా పాలు ఇచ్చే వ్యవధి తగ్గింస్తుండాలి. లేదంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కడుపునిండా ఆహారాన్ని ఇవ్వాలి. ఏడాది తర్వాత నుంచి ఘన పదార్థాలు అలవాటు చెయ్యాలి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వడం, పాలు అడిగినప్పుడు వారిని డైవర్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మానేస్తారు.