News December 24, 2024

వరిధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ వ్యాఖ్యలు

image

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులేనని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్వింటాలుకు రూ.500 బోనస్ అని రైతులలో ఆశలు రేపి, దొడ్డు వడ్లకు తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టారని రాసుకొచ్చారు.

Similar News

News December 25, 2024

KNR: ‘‘భారత్ బ్రాండ్” విక్రయ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి

image

కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఆహార ఉత్పత్తుల విక్రయాలు జరపాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన “భారత్ బ్రాండ్” విక్రయవాహనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.

News December 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్త్ రఫ్ చేయాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. @ జగిత్యాల లో మిని స్టేడియం ను పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్. @ మల్లాపూర్ మండలంలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే. @ గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిని, తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్. @ కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. @ కోరుట్లలో వైభవంగా మహా పడిపూజ.

News December 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని క్రైమ్ న్యూస్

image

☞వీణవంక: వ్యక్తిపై గొడ్డలితో దాడి ☞శంకరపట్నం: రెండు RTC బస్సులు ఢీ.. తప్పిన ప్రమాదం ☞వీణవంక: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి ☞రామడుగు: అనారోగ్యంతో AR హెడ్ కానిస్టేబుల్ మృతి ☞రాయికల్: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ☞రుద్రంగి: మైనర్ తల్లిపై కేసు నమోదు ☞ముస్తాబాద్: గుండెపోటుతో వ్యక్తి మృతి ☞కథలాపూర్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత.