News January 5, 2026
వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.
Similar News
News January 6, 2026
మిక్స్డ్ టైప్ స్కిన్‌కు ఈ ఫేస్ ప్యాక్

కొన్నిసార్లు జిడ్డుగా, మరొకసారి పొడిబారినట్లుండే చర్మతత్వం కొందరిలో కనిపిస్తుంది. దీన్నే మిక్స్డ్ టైప్ స్కిన్ అంటారు. ఇలాంటి తత్వం ఉన్నప్పుడు చర్మం డల్‌గా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఒక గుడ్డు తెల్లసొనకు తేనె, చెంచా నారింజ రసం, పావుచెంచా పసుపు కలిపి ముఖం, మెడ, చేతులకు రాయాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేస్తే చాలు. ముఖ చర్మమంతా ఒకేలా మెరుపులీనుతుంది. దీన్ని వారానికి రెండుసార్లు అప్లై చేయడం మంచిది.
News January 6, 2026
పండుగ హడావిడి అప్పుడే మొదలైంది!

సంక్రాంతికి వారం ముందే తెలుగు లోగిళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఏపీలో అరిసెలు, జంతికల సువాసనలు వెదజల్లుతుండగా తెలంగాణలో మహిళలు సకినాల తయారీలో నిమగ్నమయ్యారు. ఒకపక్క గాలిపటాలు ఎగరేస్తూ పిల్లలు కేరింతలు కొడుతుంటే మరోపక్క పందెం రాయుళ్లు కోళ్లను రెడీ చేసుకుంటున్నారు. అటు నగరవాసులు సొంతూళ్లకు ఎలా వెళ్లాలా? అనే ప్రణాళికల్లో బిజీ అయ్యారు. పల్లెల్లో ముగ్గులు, హరిదాసుల కీర్తనలతో పండుగ కళ సంతరించుకుంది.
News January 6, 2026
హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు

HYDలోని ECIL 4 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech 60% మార్కులతో ఉత్తీర్ణులై, పనిఅనుభవం గలవారు జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్, షార్ట్ లిస్టింగ్, DV, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. ఏడాదికి రూ.5వేలు పెంచుతారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in


