News January 30, 2025

వరి ధాన్యం సేకరణలో KMR రెండో స్థానం: కలెక్టర్

image

వరి ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉందని జిల్లా కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. గత మూడు, నాలుగు నెలల నుంచి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Similar News

News October 29, 2025

NGKL: భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులపై భారీ వరద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే ‘డైల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు.

News October 29, 2025

కరీంనగర్: మద్యం దుకాణాల కోసం ‘బేరసారాలు’..!

image

టెండర్లలో దుకాణాలు దక్కని మద్యం వ్యాపారులు మనోవేదనకు గురవుతూ.. డ్రాలో షాపులు గెలిచినవారితో బేరసారాలు మొదలుపెట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 287 దుకాణాలకు డ్రా జరగగా, షాపులు రానివారు ‘ఎంతైనా ఇస్తాం’ అంటూ ఆశ చూపించి దుకాణాలను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విజేతలతో ఎంతమంది భాగస్వాములున్నారు.. గుడ్‌విల్ కింద ఇచ్చే అవకాశం ఉందా..? అని ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

News October 29, 2025

ఖమ్మం: పత్తి మార్కెట్‌కి సెలవు

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డుకు నేడు (బుధవారం) సెలవు ప్రకటించినట్లు మార్కెట్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. అపరాలు, మిర్చి కొనుగోళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. పత్తి క్రయవిక్రయాలు తిరిగి ఈ నెల 30న గురువారం పునఃప్రారంభమవుతాయని తెలిపారు. పత్తి విక్రయానికి రానున్న రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.