News February 5, 2025

వరి ధాన్యం సేకరణలో KMR రెండో స్థానం: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణ, చెల్లింపులు CMR సేకరణ, వచ్చే రబీ వరి ధాన్యం సేకరణ ఏర్పాట్ల పై సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. 424 కేంద్రాల ద్వారా 4.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. వరి ధాన్యం సేకరణలో కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు.

Similar News

News September 15, 2025

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ

image

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గీతాంజలి శర్మను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆమె పనితీరు ప్రశంసలు పొందింది. ఇకపై ఫైబర్ నెట్ విస్తరణలో కీలక పాత్ర పోషించనున్నారు. కొత్త జాయింట్ కలెక్టర్‌పై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

News September 15, 2025

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్

image

సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేస్తూ భారత రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైలు బుకింగ్స్ ఓపెన్ అయిన తొలి 15నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే IRCTC లేదా అధికారిక యాప్‌లో టికెట్లు బుక్ చేసుకొనే వీలుంటుంది. OCT 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇటీవల తత్కాల్ బుకింగ్స్‌కు ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా తాజాగా సాధారణ రిజర్వేషన్లకూ వర్తింపజేయనుంది. SHARE IT.

News September 15, 2025

KMR: ప్రేమ పెళ్లికి నిరాకరించారని యువతి ఆత్మహత్య

image

ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్ మండలం అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మానస(21) అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.