News January 19, 2026
వరి నారుమడిలో ఇలా చేస్తే రైతుకు లాభం

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వరి నారుమడిలో నారు ఎర్రగా మారడం, నాటు వేసే సమయం వచ్చినా ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించాలంటే రోజూ ఉదయమే పొడుగు కర్రను తీసుకొని నారు కొన భాగాలకు తగిలిస్తూ, కొనలపై చేరిన మంచు బిందువులు రాలేలా చేయాలి. దీని వల్ల నారు ఎర్రగా కాకుండా, పెరుగుదల బాగుండటమే కాకుండా కొనల్లో చేరిన పురుగులు కూడా కిందపడి చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది.
Similar News
News February 18, 2026
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు విజయవంతం

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ ఏడాది భక్తుల రద్దీ పెరిగిందని, ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా దర్శించుకున్నారని పేర్కొన్నారు. భక్తులకు కనీస వసతులు కల్పించామని, భవిష్యత్తులో శ్రీశైలాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
News February 18, 2026
ఈనెల 20న కామారెడ్డికి రాష్ట్ర ఆహార కమిషన్ రాక

తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యుల బృందం ఈనెల 20న కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 నుంచి IDOC మీటింగ్ హాల్‌లో పౌర సరఫరాల సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.