News April 2, 2026
వరి నుంచి ఆయిల్ పామ్‌కు మారండి: DAO రాబర్ట్ పాల్

రాజమండ్రి కలెక్టరేట్‌లో APCNF, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ సూచించారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా వరి నుంచి ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 15, 2026
అనపర్తి ‘సెంటిమెంట్’ ఏంటో తెలుసా?

1952లో అనపర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంది. 14 సార్లు జరిగిన ఎన్నికలలో 12 సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలే విజయం సాధించారు. అయితే, ఒక వింతైన విషయం ఏమిటంటే, అనపర్తి నుంచి గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు మంత్రిగా అవకాశం పొందలేదు. దీనిని స్థానికులు ఒక ‘సెంటిమెంట్’గా భావిస్తారు.

బిక్కవోలుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు గ్రామానికి ఆ పేరు వెనుక ఒక చారిత్రక కారణం ఉంది. దీనిని పూర్వం ‘బిరుదాంకినవోలు’ అని పిలిచేవారు. తూర్పు చాళుక్య రాజైన గుణగ విజయాదిత్యుని బిరుదుల ఆధారంగా ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న ద్రవిడ శైలి శివాలయాలు, ఏకశిలా గణపతి విగ్రహం చాళుక్యుల కాలం నాటి ఉన్నతమైన శిల్పకళా వైభవానికి, వారి మతపరమైన ఆసక్తికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.