News November 19, 2025

వరి పంటకు అజొల్లా చేసే మేలు

image

అజొల్లా జీవన ఎరువు వరిపొలంలో నీటిపై తేలుతూ నత్రజనిని స్థిరీకరించి, వరిపైరుకు నత్రజనిని అందుబాటులోకి తీసుకొస్తుంది. వరి నాటిన వారం రోజుల తర్వాత సుమారు 2KGల అజోల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుంచి 20 రోజులు నీటిపై పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగిస్తే ఇది 3-4 రోజుల్లో కుళ్లిపోయి నత్రజనిని, ఇతర పోషకాలను మొక్కలకు అందించి పంటకు మేలు చేస్తుంది. అజోల్లాను పచ్చిరొట్ట ఎరువుగానూ ఉపయోగించవచ్చు.

Similar News

News November 19, 2025

పుట్టపర్తికి మోదీ… స్వాగతం పలికిన సీఎం

image

AP: శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయానికి చేరుకుని బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. కాసేపట్లో బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేస్తారు.

News November 19, 2025

రాగి వస్తువులు ఇలా శుభ్రం..

image

ఇటీవలి కాలంలో రాగి పాత్రల వాడకం ఎక్కువైంది. వీటిని శుభ్రం చేయడం పెద్ద టాస్క్. దాని కోసం కొన్ని టిప్స్. శనగపిండి, పెరుగు, ఉప్పు కలిపి ఆ మిశ్రమంతో రాగి పాత్రలను రుద్దితే మెరిసిపోతాయి. చెంచా ఉప్పుకి, రెండు చెంచాల వెనిగర్ కలిపి ఆ మిశ్రమంతో ఈ వస్తువులను తోమండి. మునుపటిలా తిరిగి తళతళలాడటం మీరే గమనిస్తారు. అలాగే నిమ్మరసం, ఉప్పు, బేకింగ్ సోడా కలిపి తోమినా కొత్తవాటిలా కనిపిస్తాయి.

News November 19, 2025

ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 13 మంది మృతి

image

దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా, నలుగురు గాయపడినట్లు లెబనాన్ ప్రకటించింది. ఐన్ ఎల్-హిల్వే ప్రాంతంలో ఆయుధాలతో ఉన్న హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే అక్కడ ఎలాంటి సాయుధ బలగాలు లేవని లెబనాన్ పేర్కొంది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది.