News January 7, 2026

వరి మాగాణుల్లో వెల్లుల్లి సాగు.. మంచి దిగుబడి, ఆదాయం

image

మన దగ్గర సాధారణంగా వరి కోతలు పూర్తయ్యాక అదే భూమిలో మొక్కజొన్న, సన్ ఫ్లవర్, అపరాలు నాటుతుంటాం. బంగ్లాదేశ్‌లో మాత్రం వరి కోతలు పూర్తయ్యాక ఆ భూమిలో వెల్లుల్లి నాటుతారు. వరి పంటకు వేసిన ఎరువుల వల్ల నేల సారవంతంగా ఉంటుంది. భూమిలో తేమ, వరికి వాడిన ఎరువుల వల్ల వెల్లుల్లి పంట చాలా వేగంగా, పెద్ద పరిమాణంలో పెరుగుతుందని, దీని వల్ల తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం లభిస్తోందని అక్కడి రైతులు చెబుతున్నారు.

Similar News

News February 2, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News February 2, 2026

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌: భారత్, అఫ్గాన్ మధ్య సెమీఫైనల్

image

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై 58 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-2 నుంచి భారత్, ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-1 నుంచి ఆసీస్, అఫ్గానిస్థాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఫిబ్రవరి-3న జరిగే తొలి సెమీఫైనల్‌లో ఆసీస్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఫిబ్రవరి 4న భారత్, అఫ్ఘాన్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది.

News February 2, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 02, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.26 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.