News February 23, 2025

వర్గల్: జాతీయ శిబిరానికి ఎంపికైన డిగ్రీ విద్యార్థిని

image

ఒడిశా విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమగ్రత శిబిరానికి వర్గల్ మహాత్మ బాపూలే మహిళా డిగ్రీ కళాశాలకు విద్యార్థిని వైష్ణవి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్‌ భాస్కరరావు తెలిపారు. మార్చి 3 నుంచి 9 వరకు జరిగే జాతీయ సమగ్రత శిబిరానికి ఎంపిక కావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

హైదరాబాద్‌లో వర్షాల తీరిదే..!

image

HYDలో ఏడాదిలో కురుస్తున్న వర్షాల తీరు పరిశీలిస్తే ‘కురిస్తే కుంభవృష్టి.. లేదంటే అనావృష్టి’ అన్నట్లుగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. వర్షం ప్రారంభమైన గంట వ్యవధిలోనే 15 సెంటీమీటర్ల వర్షం ఒక్కసారిగా కురుస్తోందని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో ఒకే చోట వరదలు ముంచెత్తి, ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News September 16, 2025

DSC: జిల్లాలో మిగిలిపోయిన 56 పోస్టులు

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 807 పోస్టులకు డీఎస్సీ-2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 775 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవగా, 755 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 19న అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉద్యోగ అర్హత పత్రాలు అందించనున్నారు. కొన్ని కేటగిరీలలో అభ్యర్థులు లేక జిల్లాలో 56 పోస్టులు మిగిలాయి.

News September 16, 2025

పార్వతీపురం: నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తుల స్వీకరణ

image

నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో స్వీకరించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్హత పొందిన వారికి ఈ పథకం కింద ప్రభుత్వం రూ.15వేలు ఆర్థిక సాయం అందజేయనుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఏపీలో రిజిస్టర్ కాబడిన ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ డ్రైవర్లు అర్హులన్నారు.