News March 10, 2025
వర్గల్: పెళ్లిలో డిజిటల్ కట్నాల చదివింపులు

పెళ్లిలో ఇంతకాలం పెళ్లికూతురు, పెళ్ళికొడుకు కట్నాల చదివింపులు రాతపూర్వకంగా ఉండేవి. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం కొత్త ట్రెండు మొదలైంది. అంతా డిజిటలైజేషన్ కావడంతో వర్గల్ మండలం గౌరారంలో ఆదివారం జరిగిన ఒక వివాహ వేడుకలలో పెళ్ళికొడుకు, పెళ్లికూతురు తరపున చదివింపుల కార్యక్రమంలో ఫోన్‌పే స్కానర్ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా చదివింపులు చేపట్టారు.
Similar News
News March 10, 2025
NZB: విద్యార్థిని చితికబాదిన హాస్టల్ వార్డెన్

NZBలోని ఓ ప్రైవేటు కాలేజ్‌లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వాహజుద్దీన్‌ను చదవకుండా నిద్రపోతున్నాడని ఆదివారం హాస్టల్ ఫ్లోర్ ఇన్‌ఛార్జ్ నిఖిల్ కొట్టడంతో గాయాలయ్యాయి. విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపారు. వెంటనే అక్కడికి చేరి ప్రిన్సిపల్ హనుమంతరావును అడగగా హాస్టల్లో ఎలాంటి ఘటన జరగలేదన్నారు. తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం
News March 10, 2025
వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తాం: విశాఖ సీపీ

విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్,సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరుపుతుంటాడని సీపీ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం తెలిసిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
News March 10, 2025
గార: సముద్ర స్నానాల్లో అపశ్రుతి

గార మండలంలోని చిన్నవత్సవలస రాజమ్మ తల్లి జాతర సముద్ర స్నానాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం జి. సిగడాం మండలం దేవరవలసకు చెందిన తండ్రీ, కొడుకులు కొడమటి ఈశ్వరరావు, అశోక్(23) సముద్ర స్నానానికి వెళ్లగా అలల తాకిడికి గల్లంతయ్యారు. తోటివారు కేకలు వేయడంతో మెరైన్ పోలీసులు స్పందించి, తండ్రి ఈశ్వరరావును ఒడ్డుకు తీసుకొచ్చారు. అశోక్ ఆచూకీ దొరకలేదు. ఎస్ఐ జనార్దన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.