News February 4, 2025

వర్గల్ విద్యాధరి క్షేత్రంలో ఉత్సవాలు విజయవంతం

image

ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు 50 వేలకు పైగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పదివేలకు పైగా భక్తులు పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 18, 2026

పంచాయతీల్లో ఓటుహక్కు నమోదు ఇకపై ఏడాదికి 4సార్లు

image

AP: పంచాయతీల్లో ఓటుహక్కు నమోదు ఏడాదికి 4సార్లు నిర్వహించేలా చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పటివరకు JAN 1న మాత్రమే ఓటరు నమోదు జరుగుతోంది. తరువాత పుట్టిన వారు ఏడాది పాటు వేచి ఉంటున్నారు. ఈ బిల్లుతో ఇకపై JAN, APR, JUL, OCT నెలల్లో 1న ఓటు నమోదు చేసేలా చట్టాన్ని సవరించారు. మంత్రి కందుల దుర్గేశ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అసెంబ్లీ, మున్సిపల్ ఓట్ల నమోదు కూడా ఏటా 4సార్లు చేస్తున్నారు.

News February 18, 2026

VZM: ‘సివిల్ తగాదాలను ఇరు పక్షాలతో కౌన్సిలింగ్ చేసి పరిష్కరించాలి’

image

రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చే సివిల్ తగాదాల్లో ఇరు పక్షాలను పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రెవిన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే 4వ దశలో గ్రౌండ్ ట్రూతింగ్ మార్చి 15 నాటికి పూర్తి చేసి, ఏప్రిల్ 11 నాటికి లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.

News February 18, 2026

KNR: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

image

అత్తింటి వేధింపులకు తాళలేక మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత(29) ఆత్మహత్య చేసుకుంది. KNR రూరల్ CI నిరంజన్ రెడ్డి ప్రకారం.. GDKలో నివాసముంటుండగా అనారోగ్యం పాలైన భర్త నరేష్‌ను చికిత్స నిమిత్తం KNR ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఇక్కడ కూడా కట్నం కోసం అత్తమామలు వేధించడంతో మనస్తాపం చెంది, తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో మంగళవారం పెట్రోల్ పోసుకుని ప్రాణాలు వదిలింది. కేసు నమోదైంది.