News March 10, 2025
వర్గల్: విషాదం.. తల్లి మందలించిందని విద్యార్థి సూసైడ్

తల్లి చదువుకోమని మందలించినందుకు విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం SI కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. చాంద్‌ఖాన్ మక్తాకు చెందిన విజయేందర్ రెడ్డి(15) చౌదర్‌పల్లి పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. విజయేందర్ గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లగా ఎందుకు తిరుగుతున్నావని తల్లి కనకవ్వ మందలించింది. దీంతో మనస్తాపంతో పురుగు మందు తగగా చికిత్స పొందుతూ అదివారం మృతి చెందాడు.
Similar News
News March 10, 2025
సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం.. 12 మందికి గాయాలు

సత్తుపల్లి మండలంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి శివారులోని తామర చెరువు వద్ద కాకర్లపల్లి నుంచి వెళుతున్న కూలీల ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 12 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 10, 2025
అమెరికాతో ట్రేడ్‌వార్: ఆహారమే చైనా ఆయుధం!

అమెరికాతో ట్రేడ్‌వార్‌లో చైనా చాకచక్యం ప్రదర్శిస్తోంది. ‘అధిక ప్రభావం – తక్కువ ఖర్చు’ వ్యూహాన్ని అమలు చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్‌పై ఆహారాన్ని ఆయుధంగా ప్రయోగిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులపై US అతిగా ఆధారపడ్డ మూడో దేశం చైనా. చేపలు, రొయ్యల వంటి సముద్ర ఆహారం, వెల్లుల్లి, తేనె, పప్పులను దిగుమతి చేసుకుంటుంది. 2024లో ఈ వాణిజ్యం విలువ $3.9B పైమాటే. వీటిపై అధిక సుంకాలతో ఒత్తిడి పెంచాలన్నది జింగ్‌పింగ్ ఆలోచన.
News March 10, 2025
MLC అభ్యర్థి కావలి గ్రీష్మ రాజకీయ ప్రస్థానమిదే

సంతకవిటి(M) కావలికి చెందిన కావలి గ్రీష్మ 2015లో TDP ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2016-22 మధ్యలో రాజాం పట్టణ టీడీపీ అధ్యక్షురాలిగా, ఏరియా ఆసుపత్రి ఛైర్ పర్సన్‌గా, సీబీఎన్ ARMY రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. గ్రీష్మ శాసనసభ మాజీ స్పీకర్ సీనియర్ నాయకురాలు కావలి ప్రతిభా భారతి కుమార్తె. SC సామాజికవర్గానికి చెందిన గ్రీష్మ ఉన్నత విద్యావంతురాలు.