News February 1, 2025

వర్ధన్నపేట: ఏడో తరగతి బాలిక సూసైడ్

image

ఏడో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.

Similar News

News January 7, 2026

పారదర్శకంగా ఓటర్ జాబితా సవరణ: సూర్యాపేట కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీసీలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఓటర్ జాబితాపై అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో వార్డుల మ్యాపింగ్ తప్పిదాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా సరిచేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ నెల 12న వార్డుల వారీగా జాబితా విడుదల చేస్తామన్నారు.

News January 7, 2026

నెల్లూరులో టాటా పవర్ అతిపెద్ద ప్లాంట్.. ₹6,675 కోట్ల పెట్టుబడులు!

image

AP: నెల్లూరులో టాటా సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ(TPREL) ₹6,675 కోట్లతో 10GW సామర్థ్యంతో ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఇంగాట్, వేఫర్ తయారీ సెంటర్‌గా నిలవనుంది. సెమీకండక్టర్ చిప్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తిలో ఈ మెటీరియల్స్ చాలా కీలకం. ఈ సంస్థ రాకతో ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.

News January 7, 2026

NLR: బధిర విద్యార్థులకు ఆడియో మీటర్

image

సూళ్లూరుపేటకు చెందిన ఎన్ఆర్ఐ యస్వంత్ బధిర విద్యార్థుల కోసం ఆడియో మీటర్ అందజేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బధిరుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక పాఠశాల విద్యార్థులకు రూ.82 వేల విలువైన దీనిని సమకూర్చారు. దీనికి నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేశారు. యశ్వంత్‌ను కలెక్టర్ అభినందించారు.