News December 11, 2025

వర్ధన్నపేట: ఫలితం డ్రా.. చిట్టీలు వేసి ప్రకటన

image

వర్ధన్నపేట మండలంలోని అంబేడ్కర్ నగర్‌లో 1వ వార్డు ఫలితాన్ని డ్రా ద్వారా నిర్ణయించారు. ఈ వార్డులో మొత్తం 101 ఓట్లు ఉండగా 91 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతు దారురాలు బొక్కల రజనీకి 31 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి గోకల రూపకు 31 ఓట్లు రావడంతో సమాన ఫలితం నమోదైంది. దీంతో నియమాల ప్రకారం ఎన్నికల అధికారులు చిట్టీలు వేసి విజేతను నిర్ణయించారు. గోకల రూపకు అదృష్టం వరించి విజేతగా నిలిచింది.

Similar News

News December 15, 2025

గీసుగొండలో కొండా వర్గం పాగా!

image

పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా వీడిపోయిన విషయం తెలిసిందే. గీసుగొండ మండలంలో 21 పంచాయతీల్లో రెండు ఏకగ్రీవం కాగా, మిగిలిన 19 పంచాయతీల్లో 7 పంచాయతీలకు కొండా వర్గం గెలిచింది. 3 బీఆర్ఎస్, 1 స్వతంత్ర, 8 రేవూరి కాంగ్రెస్ పార్టీలు గెలిచాయి. వాస్తవానికి కాంగ్రెస్ 15 పంచాయతీలు గెలిచినట్టు. రెండు వర్గాల ఆధిపత్య పోరుతో బీఆర్ఎస్‌కు డ్యామేజీ అయ్యింది.

News December 15, 2025

వంజరపల్లిలో ఉపసర్పంచ్ ఎన్నిక.. ఇతనే సర్పంచ్ నా ఇక..?

image

వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లిలో మోర్తల చందర్ రావు ఆరో వార్డు నుంచి గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వ్ కావడంతో గిరిజనులు లేకపోవడం కారణంగా సర్పంచ్ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. ఇదే పరిస్థితితో 1, 4, 5 వార్డుల్లోనూ ఎస్టీకి రిజర్వు కాగా నామినేషన్లు నమోదు కాలేదు. గ్రామంలో 2, 3, 6, 7, 8 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. దీంతో సర్పంచ్ ఇతనేనా..?

News December 14, 2025

నల్లబెల్లి ఆసక్తికర పోరు.. తల్లిపై కూతురు విజయం

image

వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్ర పంచాయతీ పరిధి నాలుగో వార్డులో జరిగిన ఎన్నికల్లో తల్లిపై కూతురు విజయం సాధించారు. ఈ సమరంలో తల్లి సరోజనపై కూతురు సౌజన్య స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 120 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన సౌజన్య గెలుపు ఆ పార్టీకి బలమైన ఉత్సాహాన్ని ఇచ్చిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.