News October 5, 2025

వర్ధన్నపేట: బీర్ టిన్‌లో తలదూర్చి పాము మృతి

image

ఓ పాము బీర్ టిన్‌లో తలదూర్చి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులోని ఎస్సారెస్పీ కాలువ కట్టపై కనిపించింది. తాగి పడేసిన టిన్ బీర్‌లోకి పాము తల దూర్చడంతో తిరిగి బయటకు రావడానికి ఇబ్బందులు పడింది. ముందుకు, వెనక్కి వెళ్లినా బీర్ టిన్‌లో పెట్టిన తల బయటకు రాలేదు. బండారి కుమారస్వామి అనే గీత కార్మికుడు దీన్ని గమనించి అతని ఫోన్లో బంధించాడు.

Similar News

News April 13, 2026

వరంగల్ ప్రజావాణిలో 166 వినతులు

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డా.సత్య శారద ప్రజల నుంచి 166 వినతిపత్రాలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 74, జీడబ్ల్యూఎంసీకి 25, ఇతర శాఖలకు 67 దరఖాస్తులు వచ్చాయి. సంబంధిత అధికారులతో సమక్షంలోనే చర్చించి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. జూమ్ ద్వారా తహశీల్దార్లు, ఎంపీడీవోలతో సమన్వయం చేసి చర్యలు చేపట్టారు.

News April 13, 2026

WGL: బర్త్‌డేలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..!

image

నర్సంపేటలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఉప్పరపల్లికి చెందిన చింతకింది శివకృష్ణ, మౌనిక దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు అక్షర 2020 జూన్ 3వ తేదీన జన్మించింది. రెండవ సంతానం అర్జున్ 2022, జూన్ 3వ తేదీన, మూడవ సంతానం ఆదిత్య 2024 జూన్ 3వ తేదీన జన్మించాడు. ముగ్గురూ ఒకే నెల, ఒకే తేదీన రెండేళ్ల వ్యవధిలో జన్మించడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

News April 13, 2026

నెక్కొండ: 470కి 467 మార్కులు సాధించిన తేజస్వి

image

నెక్కొండ టీజీఆర్‌జేసీకి చెందిన తేజస్వి ఇంటర్ మొదటి సంవత్సరం MPCలో 470కి 467 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన ఆమె తండ్రి అశోక్ కుమార్, తల్లి మమత కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తేజస్వి కష్టపడి ఈ ఫలితాన్ని సాధించింది. భవిష్యత్తులో ఐపీఎస్ అధికారి కావాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తానని తెలిపింది.