News March 29, 2025
వర్మగారూ మీ వైఖరి మార్చుకోండి: ముద్రగడ క్రాంతి

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి పదవి రాకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణం కాదని ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అది టీడీపీ సొంత వ్యవహారమని, మీరూ మీరు తేల్చుకోవాలి కానీ జనసేనపై అక్కసు వెళ్లగక్కడం ఎంతమంత్రం తగదని ఆమె హెచ్చరించారు. మీరు వైసీపీలోకి వెళతారని, ఆ పార్టీ వాళ్లతో టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయన్నారు. ‘వర్మ గారు మీరు తీరు మార్చుకోండి’ అని ఆమె తెలిపారు.
Similar News
News March 31, 2025
మయన్మార్: 2వేలకు చేరిన భూకంప మృతుల సంఖ్య

మయన్మార్‌లో నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న ఘోర భూకంపంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2056మంది చనిపోయినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా.. భూకంప తీవ్రతను ప్రపంచానికి చూపించేందుకు అక్కడికి వెళ్లిన అంతర్జాతీయ మీడియా సంస్థల్ని దేశంలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది.
News March 31, 2025
KNR: డిప్యూటీ కలెక్టర్‌కు ఎంపికైన హరిణి

కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కన్నం హరిణి గ్రూప్-1లో 499.5మార్కులతో స్టేట్ 55వ ర్యాంక్ సాధించి, డిప్యూటీ కలెక్టర్‌కు సెలెక్ట్ అయ్యారు. హరిణి తల్లిదండ్రులు రమేష్, కళా ప్రపూర్ణ జ్యోతి ప్రభుత్వ టీచర్లు. విద్యానగర్‌లోనే ప్రాథమిక విద్యాను అభ్యసించిన హరిణి ఇంజనీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అనంతరం ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు.
News March 31, 2025
KKD: తుది జట్టు నుంచి రాజును తప్పించిన ముంబై

కాకినాడ యువ క్రికెటర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్లో తుది జట్టు నుంచి తప్పించింది. తొలి రెండు మ్యాచ్‌లకు అవకాశం ఇచ్చి మూడో మ్యాచ్లో పక్కన పెట్టింది. కేకేఆర్ మ్యాచ్‌లో రాజు స్థానంలో అశ్విని కుమార్‌ను బరిలోకి దింపింది. కాగా సత్యనారాయణ రాజు రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఒక వికెట్ తీశారు.