News October 11, 2025
వర్మ.. HYDకు రంజీ ‘తిలకం’ దిద్దు!

రంజీ ట్రోఫీ.. దేశంలో 90 సార్లు జరిగిన క్రికెట్ సంగ్రామం. ఈ దేశవాలీ క్రికెట్‌లో HYD జట్టు కేవలం 2 టైటిళ్లు మాత్రమే గెలిచింది. మరో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. నాలుగు దశబ్దాలుగా రంజీ ట్రోఫీని HYD కైవసం చేసుకోలేకపోయింది. OCT 15 నుంచి 2025-26 సీజన్ ప్రారంభంకానుంది. ఈసారి హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ ఉండడంతో అభిమానుల్లో హోప్స్ పెరిగాయి. ఈ సీజన్‌లోనైనా <<17955623>>విజయ తిలకం<<>> దిద్దాలని ఫ్యాన్స్ కోరిక.
Similar News
News October 12, 2025
సచివాలయం: వీధి కుక్కలను పట్టుకున్న అధికారులు

తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. సచివాలయం ప్రాంగణంలోని మీడియా పాయింట్, క్యాంటీన్, విజిటర్స్ లాంగ్‌లో తిరుగుతున్న కుక్కలను అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, సందర్శకులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
News October 12, 2025
VKB: బాలికలు.. క్రీడల్లో మహారాణులు

వికారాబాద్ జిల్లా పుట్టపాడు హై స్కూల్‌కి చెందిన బాలికలు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన బాలికలు కబడ్డీ అండర్-14 బాలికల విభాగంలో పరిగి జోన్‌లో విజేతగా నిలిచారు. వసుధా రెడ్డి, మదిహా ఫాతిమా, అక్షిత జిల్లాస్థాయిలో రాణించి, ప్రతిభ చాటారు. PD ప్రణవి ప్రోత్సాహంతో విద్యార్థులు అన్ని క్రీడల్లో రాణిస్తున్నారు. నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా.. Way2News ప్రత్యేక కథనం.
News October 12, 2025
కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి: పవన్

AP: పకడ్బందీ ప్రణాళికతో కాకినాడ(D) తీర ప్రాంత కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని Dy.CM పవన్ అధికారులను ఆదేశించారు. ‘ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనం చేయండి. 100రోజుల ప్రణాళికతో జాలర్ల సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించండి. మనం తీసుకోబోయే కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి. వ్యర్థాలను శుద్ధి ప్రక్రియలో అధునాతన సాంకేతికతను పరిశ్రమలు వినియోగించాలి’ అని తెలిపారు.