News April 13, 2025
వర్షంతో నష్టపోయిన రైతులకు సహాయం: మంత్రి తుమ్మల

ఆకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా పంట నష్టాలను ఎదుర్కొన్న రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించనున్నట్లు సమాచారం. గత నెలలో 8,408 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడించారు. నష్టపోయిన రైతుల వివరాలను సర్వే చేసి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
Similar News
News April 14, 2025
ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు కుట్ర..!

వివాహేతర సంబంధంతో ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖానాపురం హవేలీ సీఐ భానుప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన కథనం ప్రకారం.. ముదిగొండ (మం) సువర్ణపురంకు చెందిన ధర్మ భార్యతో.. రామాంజనేయులు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎలాగైనా ప్రియురాలి భర్త(ధర్మ)ను అడ్డు తొలగించాలని తన స్నేహితులతో కుట్ర చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
News April 14, 2025
ఖమ్మం: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

ఖమ్మం: మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
News April 13, 2025
ఖమ్మం జిల్లా చెట్టంత గొప్ప మనిషిని కోల్పోయింది.!

ఖమ్మం జిల్లా చెట్టంత గొప్ప మనిషిని కోల్పోయింది. పర్యావరణ పరిరక్షణ కోసం పద్మశ్రీ వనజీవి రామయ్య చేసిన కృషి వెలకట్టలేనిది. దాదాపు కోటిన్నర మొక్కలు నాటారు రామయ్య-జానకమ్మ దంపతులు. ఆయన పర్యావరణ సేవలకు గాను 3వేల ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు వరించాయి. ఆయన మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వనజీవి రామయ్యకు నివాళి అంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడమే.. ఏమంటారు?..