News February 15, 2026
వర్షంతో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే?

కొలంబోలో నేడు జరగాల్సిన భారత్-పాక్ హై-వోల్టేజ్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ టైమ్(7pm)కు వర్షం కురిసే ఛాన్స్ 65% వరకు ఉందని వాతావరణ శాఖ అంచనా. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కావడంతో రిజర్వ్ డే లేదు. వర్షం వల్ల కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దవుతుంది. అప్పుడు ఇరుజట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. ఇప్పటికే తలో రెండు విజయాలతో ఉన్న భారత్, పాక్.. 5 పాయింట్లతో నేరుగా సూపర్-8కు చేరుకుంటాయి.
Similar News
News February 15, 2026
నేడు శివారాధన ఎందుకు చేయాలంటే?

తనను తాను తెలుసుకోవడమే నిజమైన శివత్వం. అజ్ఞానంతో వేటగాడు చేసిన బిల్వార్చన అతని మనసును మార్చేసినట్లు, జ్ఞానంతో చేసే ఉపాసన మనల్ని పవిత్రం చేస్తుంది. శివుడు జ్ఞానమూర్తి. ఆయనను చేరుకోవాలంటే మన హృదయం హిమాలయమంత స్వచ్ఛంగా ఉండాలి. జ్ఞానానికి ప్రేమ తోడైనప్పుడే సృష్టిలోని సౌందర్యాన్ని చూడగలం. కామ క్రోధాలను జయించి, నిశ్చలమైన బుద్ధితో శివుడిని ఆరాధించినప్పుడే మనలో శివత్వం సాక్షాత్కరించి, జీవితం ధన్యమవుతుంది.
News February 15, 2026
పండ్ల తోటల్లో పిందెలు రాలడానికి కారణాలు

☛ మామిడి -పుష్పాలలో పరాగ సంపర్క లోపం, పుష్ప దశలో వర్షం, హార్మోన్ల అసమతుల్యత, రసం పీల్చే పురుగుల దాడి
☛ నిమ్మ, బత్తాయి – అధిక వర్షాలు, అధిక ఎరువుల వాడకం, పాము పొడ పురుగు
☛ ద్రాక్ష – అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, అధిక తేమ, బూడిద, ఆంత్రాక్నోస్ తెగులు
☛ బొప్పాయి – పరాగసంపర్కం లోపం, బోరాన్ లోపం, అధిక వర్షం లేదా నీరు నిల్వ ఉండిపోవడం, బూడిద తెగులు పుష్పాలపై రావడం వల్ల పిందెలు రాలిపోతాయి.
News February 15, 2026
ఈ 5 స్నాక్స్‌తో గ్లోయింగ్ స్కిన్

మెరిసే చర్మం కోసం ఖరీదైన క్రీములే కాదు. మనం తినే ఫుడ్ కూడా ముఖ్యమేనని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్, అంజీర్‌లోని ఫైబర్ స్కిన్‌ను ఫ్రెష్‌గా ఉంచుతాయి. బీట్‌రూట్ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచితే, వేయించిన శనగలు మొటిమలను తగ్గిస్తాయి. పిస్తాలోని విటమిన్-E ముడతలు పడకుండా కాపాడుతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం ఉప్పు, పంచదార తక్కువగా ఉండే ఈ 5 స్నాక్స్‌ను డైట్‌లో చేర్చుకోండి.


