News September 23, 2025
వర్షం ఎఫెక్ట్.. బాపట్ల బీచ్ ఫెస్టివల్ వాయిదా.!

బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో ఈనెల 26-28 తేదీల్లో జరగాల్సిన బీచ్ ఫెస్టివల్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. AP ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ 26, 27 తేదీల్లో బాపట్ల జిల్లాకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఫెస్టివల్ వాయిదా వేసినట్లు ప్రకటించారు. జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మళ్లీ నిర్వహించే తేదీని ఖరారు చేయాల్సిఉంది.
Similar News
News September 23, 2025
4న ఒంగోలుకు పవన్ కళ్యాణ్ రాక?

ప్రకాశం జిల్లాకు త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఒంగోలులో బాలినేని ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 4వ తేదీన ఈ కార్యక్రమ ప్రారంభానికి పవన్ వస్తారని సమాచారం. అమరావతిలో బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న డిప్యూటీ సీఎంను కలిసి ఈ మేరకు చర్చించారు.
News September 23, 2025
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ప్రకాశం ఎస్పీ

ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతిని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తికి మొక్కను ఎస్పీ అందజేశారు. అనంతరం బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా పోలీస్ శాఖ తరపున కృషి చేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.
News September 22, 2025
టంగుటూరు వద్ద ప్రమాదం.. ఇద్దరి మృతి

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వెళ్తున్న బైక్- లారీ ఢీకొన్నాయి. టంగుటూరి SI నాగమల్లేశ్వరరావు గాయాలైనవారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. మృతులు పుల్లారెడ్డిపాలెంకి చెందిన బొడ్డు వెంకటేశ్వర్లు, వెంకటాయపాలెంకి చెందిన చొప్పర శ్రీనుగా గుర్తించారు.