News June 11, 2024
వర్షాకాలం శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: సీతక్క

వర్షాకాలం శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల పై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా, అధిక వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News January 7, 2026
ADB: కోర్టులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలి: ఎస్పీ

ఆదిలాబాద్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం నిర్వహించారు. నమోదైన ప్రతి ఒక్క కేసులో నిందితులు కోర్టుకు హాజరు అయ్యేవిధంగా సమన్లను జారీ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు తప్పించుకోవడానికి లేకుండా చూడాలన్నారు. కోర్టుకు హాజరు కాని వారిపై ఎన్‌బీడబ్ల్యూలను తీసుకొని తగు చర్యలను చేపట్టాలన్నారు. కోర్టులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలన్నారు.
News January 7, 2026
ADB: ఓటరు జాబితాలో లోపాలు ఉండొద్దు: ఎస్ఈసీ కమిషనర్

మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు ADB కలెక్టర్ రాజర్షిషా కమిషనర్‌కు వివరించారు.
News January 7, 2026
ADB: ఈనెల 9న లూయి బ్రేయిల్ జయంతి వేడుకలు

అంధుల పాలిట వెలుగులు నింపిన లూయి బ్రేయిల్ 217వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈనెల 9న ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్క ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు అంధ ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు కావాలని కోరారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని, అంధుల సమస్యలపై అవగాహన కల్పించేలా కార్యక్రమం సాగుతుందని పేర్కొన్నారు.


