News August 27, 2025
వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలకు అలుగులు పొంగుతున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లోని నీరు నిలిచే ప్రాంతాల వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News August 27, 2025
HYD: రైల్వే అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచండి: DRM

సికింద్రాబాద్ రైల్వే అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచాలని DRM గోపాలకృష్ణన్ అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. స్టీల్ వర్క్ దాదాపుగా చివరి స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఇప్పటికే వెయిటింగ్ అలా అందుబాటులోకి రాగా, త్వరలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు వివరించారు.
News August 27, 2025
HYD: ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో రూ.72.31కోట్లతో టెండర్లు

HYDలో 44 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, కొత్త వాటి ఏర్పాటుకు రూ.72.31 కోట్లతో టెండర్లు పిలవనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేసింది. నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం కోసం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. పనులపై కసరత్తు చేయాలనే సూచించినట్లు జీహెచ్ఎంసీ వివరించింది.
News August 27, 2025
HYD: భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేడు పలు రైళ్లు రద్దు చేసింది. నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను రద్ద అయింది. మెదక్ – కాచిగూడ రైలు నేడు పాక్షికంగా రద్దు చేశారు. హైదరాబాద్ రైల్వే డివిజన్‌లోని భిక్నూర్ – తల్మడ్ల సెక్షన్, అకన్నపేట్ – మెదక్ సెక్షన్‌లో ట్రాక్‌లపై వరద నీరు పొంగిపొర్లుతుంది.