News August 28, 2025
వర్షాలపై వరంగల్ పోలీస్ హెచ్చరిక

భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. వర్షాల వల్ల రహదారులు జలమయం కావొచ్చని, అటువంటి సమయంలో నడవడం లేదా వాహనాలు నడపడం ప్రమాదకరమని సూచించింది. తక్కువ లోతు ఉన్న నీటిలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఈ సందేశాన్ని తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేస్తూ, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News August 29, 2025
యువత దరఖాస్తు చేసుకోవాలి: వికారాబాద్ కలెక్టర్

ఏటీసీ సెంటర్లలో శిక్షణ కోసం యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. తాండూర్, మోమిన్‌పేట్, వికారాబాద్ ఏటీసీ సెంటర్లలో కోర్సులు ప్రారంభం కానున్నందున గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఏటీసీ సెంటర్లలో శిక్షణ పొందితే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నారు.
News August 29, 2025
విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. మరొకరు అరెస్ట్

AP: విజయనగరం ఐసిస్ ఉగ్ర కుట్ర కేసులో బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అరెస్టయ్యారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు NIA వెల్లడించింది. గతంలో <<16451593>>అరెస్టైన <<>>నిందితులు సమీర్, సిరాజ్‌లతో ఆరిఫ్‌కు సంబంధాలున్నాయని గుర్తించింది. వీరంతా కలిసి ఉగ్రదాడులకు కుట్ర పన్నారని, జిహాదీ కార్యక్రమాల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించినట్లు NIA తెలిపింది.
News August 29, 2025
సంగారెడ్డిలో హెల్ప్‌లైన్ నంబరం 08455- 276155

సంగారెడ్డి కలెక్టరేట్‌లో అత్యవసర సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తక్షణ సహాయం కోసం అత్యవసర నంబర్ 08455 – 276155 ఏర్పాటు చేశామన్నారు. వర్షాలతో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఫోన్ చేయవచ్చని, అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపడతారని కలెక్టర్ సూచించారు.