News August 14, 2025

వర్షాలు.. నెల్లూరు జేసీ కీలక ఆదేశాలు

image

భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నిశాఖల అధికారుల అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ ఆదేశించారు. డిజాస్టర్‌ మేనేజ్మంట్‌ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. గతంలో ఏయే ప్రాంతాలు వర్ష ముంపునకు గురయ్యాయో ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆయన ఆదేశించారు.

Similar News

News August 14, 2025

జగన్ ప్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారు: ఆనం

image

పులివెందుల, ఒంటిమిట్టలో వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడంతో జగన్‌కు ప్రస్టేషన్ వచ్చిందని.. అదే ఊపులో మాట్లాడుతున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు సంతపేటలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలిసారి పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు స్వేచ్ఛగా ఓటేశారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఓటర్లు గెలిపించారని కొనియాడారు. చంద్రబాబు వయస్సుకు జగన్ గౌరవం ఇవ్వాలని హితవు పలికారు.

News August 14, 2025

స్వాతంత్ర్య వేడుకల కవాతు రిహార్సల్స్ పరిశీలించిన SP

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్‌ను SP జి.కృష్ణకాంత్ పరిశీలించారు. పెరేడ్ బాగుందని, ఇదే స్పూర్తితో రేపు కూడా పెరేడ్ రెట్టింపు ఉత్సాహంతో చేయాలన్నారు. జెండా వందనానికి విచ్చేసే ముఖ్య అతిథి, అతిథులు గౌరవార్ధం ఇచ్చే వందన సమర్పణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రతా పరంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు.

News August 14, 2025

నెల్లూరు: రేపటి నుంచి ఫ్రీ బస్సు

image

స్త్రీ శక్తి పేరిట ఆర్టీసీ బస్సులలో మహిళకు ఉచిత ప్రయాణం పథకాన్ని రేపటి నుంచి ప్రభుత్వం అమలు చేయబోతోంది. నెల్లూరు రీజియన్ పరిధిలో 642 బస్సులు ఉన్నాయి. వాటిలో 510 సొంత బస్సులో కాగా.. రోజుకి సుమారు 1.5 లక్షల మంది ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. రూ.95 లక్షలు రోజువారి రాబడి ఆర్టీసీకి వస్తుంది. మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కనిపిస్తే 80 శాతం మంది మహిళలు ప్రయాణించే అవకాశం ఉంటుంది.