News February 23, 2026

వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

TG: రాష్ట్రంలో రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, SRPT, మహబూబాబాద్, WGL, హనుమకొండ, RR, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, SDPT, జనగాం, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో రేపు 8.30am వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News February 27, 2026

వదినమ్మకు ఆనంద్ దేవరకొండ అదిరిపోయే వెల్కమ్

image

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన వదినకు వెల్కమ్ చెప్పారు. ‘ఫ్యాన్స్ తనను కలిసినప్పుడల్లా ‘వదిన ఎలా ఉన్నారు?’ అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది’ అని ఆనంద్ సరదాగా పేర్కొన్నారు. అత్యంత దయగల, పాజిటివ్ పర్సన్ వదినగా రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ జంట ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని ఆకాంక్షించారు.

News February 27, 2026

ఎప్‌స్టీన్ ప్రకంపనలు.. దిగ్గజాల రాజీనామా

image

ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాలు పదవులకు రాజీనామా చేస్తున్నారు. WEF CEO బోర్జ్ బ్రెండే, హార్వర్డ్ మాజీ ప్రెసిడెంట్ లారెన్స్ సమ్మర్స్, నోబెల్ గ్రహీత రిచర్డ్ ఆక్సెల్ తమ పదవుల నుంచి వైదొలిగారు. గోల్డ్‌మన్ శాక్స్ లీగల్ ఆఫీసర్ క్యాథీ రూమ్లెర్, హయత్ హోటల్స్ వారసుడు థామస్ ప్రిట్‌జ్కర్, DP వరల్డ్ ఛైర్మన్ సుల్తాన్ అహ్మద్, నార్వే అంబాసిడర్ మోనా కూడా ఈ లిస్టులో ఉన్నారు.

News February 27, 2026

సూసైడ్ గురించి సెర్చ్ చేస్తే పేరెంట్స్‌కు అలర్ట్

image

పిల్లలు సూసైడ్ లేదా సెల్ఫ్-హార్మ్ వంటి పదాలతో ఇన్‌స్టాలో సెర్చ్ చేస్తే.. వెంటనే పేరెంట్స్‌కు అలర్ట్ వెళ్లేలా కొత్త ఫీచర్‌ వచ్చింది. పేరెంట్స్ సూపర్విజన్ టూల్స్ వాడుతున్న వారికి ఈ నోటిఫికేషన్లు వాట్సాప్ లేదా SMS రూపంలో వెళ్తాయి. ప్రస్తుతం US, UK వంటి దేశాల్లో మొదలైన ఈ ఫీచర్ 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. పిల్లలను కౌన్సెల్ చేసేలా నిపుణుల సలహాలనూ ఇన్‌స్టా అందిస్తుంది.