News July 19, 2024
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: CP సునీల్ దత్

ఖమ్మం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జలాశయాలు, చెరువులు, వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర సమయాల్లో సహకారం అందించేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబరు 87126 59111 అందుబాటులో వుంటుందని, సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు.
Similar News
News October 23, 2025
ఖమ్మం: మద్యం టెండర్లకు మంచి స్పందన

ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన లభించింది. గురువారం(నేటి)తో దరఖాస్తు గడువు ముగుస్తుండగా, వ్యాపారులు తీవ్రంగా పోటీ పడ్డారు. జిల్లాలోని 116 షాపులకు బుధవారం వరకు ఏకంగా 4,177 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజు కావడంతో దరఖాస్తులు మరింత భారీగా దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
News October 23, 2025
KMM: ‘తక్కువ పెట్టుబడి-ఎక్కువ ఆదాయం’ అంటూ మోసం

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ ఖమ్మం నగరానికి చెందిన ఓ వైద్య విద్యార్థిని ప్రత్యూషను గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడు. మధురానగర్‌కు చెందిన ప్రత్యూషకు మొబైల్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి.. రూ.40 వేలు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. డబ్బు చెల్లించినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News October 23, 2025
ఖమ్మం: పంచారామాలకు ప్రత్యేక డీలక్స్ బస్సు

కార్తీక మాసం సందర్భంగా ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి పంచారామాలకు ప్రత్యేక డీలక్స్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఈనెల 26న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1040గా నిర్ణయించారు. వివరాలకు 91364 46666ను సంప్రదించవచ్చు.