News March 19, 2025

వర్సిటీకి ఇక మిగిలేది కేవలం 1400 ఎకరాలే!

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) కోసం ప్రభుత్వం 1974లో 2300 ఎకరాలు కేటాయించింది. అయితే వర్సిటీ ఏర్పాటైన 50 ఏళ్లలో వివిధ అవసరాల కోసం 500 ఎకరాలను వెనక్కుతీసుకున్నారు. ఆ తరువాత ఆ భూముల జోలికి రాలేదు. ఇపుడు మరోసారి ప్రభుత్వం HCU వద్ద 400 ఎకరాల లాగేసే ప్రయత్నం చేస్తోంది. అలా చేస్తే ఇక హెచ్సీయూ వద్ద మిగిలేది కేవలం 1400 ఎకరాలే.

Similar News

News November 2, 2025

HYD: BHEL విజిలెన్స్ వారోత్సవంలో హైడ్రా కమిషనర్

image

HYD BHEL విజిలెన్స్ వారోత్సవంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలనకు వ్యవస్థలు, చట్టాలు, పౌరుల హక్కులపై అందరిలోనూ అవగాహన అవసరమని అన్నారు. హైడ్రా చేపట్టిన చర్యల వల్ల ప్రజల్లో చెరువుల FTL, బఫర్, నాలాల అవశ్యకతపై అవగాహన పెరిగి, ప్రభుత్వ భూముల పరిరక్షణకు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో BHEL E.D కేబీరాజా, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

News November 2, 2025

HYD: KTR రోడ్ షోలో మహేశ్‌బాబు డైలాగ్‌తో ఫ్లెక్సీ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. శనివారం రాత్రి రహమత్‌నగర్‌లో జరిగిన KTR రోడ్ షోలో ఓ కార్యకర్త మహేశ్‌బాబు డైలాగ్‌తో ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘దస్ దిన్‌కే బాద్.. ఇదరీ మిలేంగి.. జెండా పాతేంగి’ అని బిజినెస్‌మెన్ మూవీలోని డైలాగ్ ఫ్లెక్సీని ప్రదర్శించాడు. ‘పది రోజుల్లో ఇక్కడే కలుద్దాం.. BRS జెండా ఎగరేద్దాం’ అంటూ ఆ పార్టీ నేతలు అన్నారు.

News November 2, 2025

వికారాబాద్: కుటుంబ కలహాలే హత్యలకు కారణం..!

image

వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో <<18174716>>ముగ్గురి హత్యలకు కారణం<<>> కుటుంబ కలహాలేనని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలు.. భార్య అలివేలు, ఆమె సోదరి హన్మమ్మ, చిన్న కూతురు శ్రావణి నిద్రిస్తుండగా ఏపూరి యాదయ్య(38) ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు వారిని కత్తితో నరికి చంపాడు. పెద్ద కూతురు అపర్ణపై కూడా దాడి చేయగా తప్పించుకుంది. అనంతరం ఆయన సూసైడ్ చేసుకున్నాడు. DSP శ్రీనివాస్ ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు.