News March 20, 2025

వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే?

image

పాలకుర్తి వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.49,108 వచ్చినట్లు ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. 2024 మే 17 నుంచి 2025 మార్చి 20 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు, 308 రోజుల ఆదాయాన్ని గురువారం ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 19, 2025

దసరా సెలవులు పొడిగించాలని డిమాండ్!

image

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. APలో ఈనెల 22-OCT2 వరకు సెలవులిచ్చి, 3న రీఓపెన్ చేస్తామని పేర్కొన్నాయి. అయితే, పండుగ 2వ తేదీనే ఉందని.. సొంతూళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు మరుసటిరోజే ఎలా వస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 4వ తేదీ వరకైనా హాలిడేస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. TGలో స్కూళ్లకు ఈనెల 21-OCT3 వరకు సెలవులిచ్చారు.

News September 19, 2025

HYD: బతుకమ్మ వేడుక.. బస్సులు సిద్ధం ఇక

image

బతుకమ్మ వేడుకలు.. దసరా సెలవులు త్వరలో రానుండటంతో సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. MGBS, ఆరాంఘర్, జేబీఎస్, KBHP కాలనీ, ఎల్‌బీనగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికులు వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.

News September 19, 2025

నిర్మల్: ‘విద్యాశాఖ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలి’

image

విద్యాశాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని ఆర్జేడీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎంఈఓలతో ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఐఎఫ్ఎస్సీ ప్యానెల్స్, టాస్ ఉల్లాస్ నమోదు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ హాజరు, పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, ఏఏపీసీ పనుల నిర్వహణ, గ్రంథాలయాల నిర్వహణను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.