News March 20, 2025
వల్మీడి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన MLA

పాలకుర్తి మండలం వల్మీడి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆవిష్కరించారు. సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని, వేలాది మంది భక్తులు హాజరయ్యే ఈ మహోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయం పరిసరాలను శుభ్రంగా ఉంచి,తాగునీరు, పారిశుధ్యం, తదితర అందుబాటులో ఉంచాలని సూచించారు.
Similar News
News March 22, 2025
నంద్యాల జిల్లాలో దారుణ హత్య

నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
News March 22, 2025
మచిలీపట్నం విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

మచిలీపట్నంలోని జడ్పీ స్కూల్ విద్యార్థులు టూర్‌కి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని వీరి బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News March 22, 2025
భువనగిరి జిల్లాలో వర్షపాత వివరాలు

భువనగిరి జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా భువనగిరి మండలంలో 29మిమీ వర్షం కురవగా, అత్యల్పంగ మోత్కూర్ మండలంలోని దతప్పగూడెంలో 0.8మిమీ వాన పడింది. యాదగిరిగుట్టలో 23.8మిమీ, బొమ్మలరామారం 23.3మిమీ, మూటకొండూర్ 20 మిమీ, రాజాపేట 17.3మిమీ, తుర్కపల్లి 16.3మిమీ, ఆత్మకూర్ 7.8మిమీగా నమోదైంది.