News December 31, 2025
వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారా?

AP: YCP నేత, మాజీ MLA వల్లభనేని వంశీని మళ్లీ అరెస్టు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 17న వంశీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో అప్పటి నుంచి ఆయన కనిపించకపోవడంతో, పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన 137 రోజులు జైలులో ఉండి వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News January 1, 2026
CBNపై KCR విమర్శలు.. TDP నేతల ఫైర్!

AP CM చంద్రబాబుపై BRS చీఫ్ KCR ఇటీవల చేసిన <<18634035>>వ్యాఖ్యలపై<<>> AP TDP నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. CBN స్టేట్స్‌మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తోందని, KCRకి నచ్చితే ఎంత? నచ్చకుంటే ఎంత? అంటూ మంత్రి ఆనం ఫైరయ్యారు. తమ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం బాధించిందన్నారు. అధికారం పోయినప్పుడల్లా CBNపై పడి ఏడవటం BRSకు అలవాటుగా మారిందని, కేసీఆర్ TDPలోనే పెరిగారని నిన్న MLA బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.
News January 1, 2026
ఈ ఏడాది పండుగల తేదీలివే..!

ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు జనవరి 13 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్నాయి. ఫిబ్రవరి 15న శివరాత్రి, మార్చి 4న హోలీ, 19న ఉగాదితో పాటు 19/20న రంజాన్ పండుగ ఉండనుంది. మార్చి 27న శ్రీరామనవమి, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి రానున్నాయి. ఆగస్టు 28న రాఖీ, సెప్టెంబర్ 14న వినాయక చవితి, అక్టోబర్ 20న దసరా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 8న దీపావళి, 24న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 25న క్రిస్మస్‌తో ఏడాది ముగియనుంది. share it
News January 1, 2026
కొబ్బరినూనెలో ఇది కలిపి రాస్తే..

కొబ్బరినూనెను జుట్టుకు రాయడం వల్ల జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. కొబ్బరినూనెను కాస్త వేడిచేసి అందులో కాస్త ఉసిరి పొడిని వేయాలి. ఆ మిశ్రమం చల్లారాక దాన్ని మీ జుట్టు, తల చర్మంపై పూర్తిగా పట్టేలా అప్లై చేయండి. అలా గంట పాటు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చెయ్యాలి. దీని వల్ల స్కాల్ప్‌లో రక్త ప్రసరణ పెరుగుతుందని, ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.


