News February 13, 2025
వల్లభ నేని వంశీ అరెస్టును ఖండించిన భూమన

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వంశీని అరెస్టు చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులపై ప్రతీకారంతో అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలు సంయమనంతో ఉండాలని భూమన సూచించారు.
Similar News
News July 9, 2025
తెలంగాణకు యూరియా కోత.. కేంద్రానికి ఎంపీ వంశీకృష్ణ లేఖ

తెలంగాణకు యూరియా కేటాయింపులు 45% తగ్గించడాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. రాజకీయ ప్రేరణతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధికంగా యూరియాను సరఫరా చేసి, తెలంగాణను ఉపేక్షించడం అన్యాయమన్నారు. RFCLలో తయారైన యూరియాను ముందుగా తెలంగాణకే కేటాయించాలన్నారు. రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
News July 9, 2025
10 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను: గోపాలకృష్ణ

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పీ-4 పథకంపై ప్రత్యేక అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా 10 కుటుంబాలను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో సుమారు 75 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని, వారికి మార్గదర్శకులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు.
News July 9, 2025
కృష్ణా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని డిగ్రీ 5, 6వ సెమిస్టర్ థియరీ (వన్ టైమ్ ఆపర్చునిటీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 14 నుంచి 25 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని కేఆర్‌యూ వర్గాలు తెలిపాయి. 5వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 6వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. పూర్తి వివరాల కోసం https://kru.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.